ఆకేరు న్యూస్, కమలాపూర్ : నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు అని కేటీఆర్ సామాజిక వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తుది దశ ఉద్యమ ఫలితంగా తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్) అన్నారు.సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు అని డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు.

…………………………………………………
