ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల గురుకుల పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ బాలికా విద్య ప్రాముఖ్యత అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన హైస్కూల్ విభాగం నుండి ముగ్గురికి, ఇంటర్మీడియట్ విభాగం నుండి ముగ్గురికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ బాలికలకు విద్య అనేది ఒక ధైర్యము అని, సమాజంలో గౌరవం పెంచుతుందని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.
……………………………………………………….
