– మండలంలో 85.45% శాతంగా పోలైన ఓట్లు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయనీ ఎంపీడీవో గుండె బాబు తెలిపారు. మండలంలో 23 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించగా మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలైన ఓట్ల శాతాన్ని ఎంపీడీవో తెలిపారు. అత్యధికంగా మర్రిపల్లిలో 91.8% పోలవ్వగా, అత్యల్పంగా కానిపర్తిలో 71.6%గా శాతం గా పోలయ్యాయి. మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలు అయిన కమలాపూర్ లో 79.4% శాతంగా, ఉప్పల్ లో 81.3% ఓట్లు పోల్ అయ్యాయి. కాగా మండల వ్యాప్తంగా 83.45% శాతంగా ఓట్లు పోలయ్యాయి.

………………………………………………
