ఆకేరున్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వ కుల గణన నిర్ణయాన్ని హర్షిస్తూ మండల బిజెపి నాయకులు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి స్థానిక బస్టాండ్ కూడలి వద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కుల గణనతో దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని, తద్వారా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని, దేశ ప్రజల కోసం, ప్రత్యేకంగా అణగారిన వర్గాల అభివృద్ధి దిశగా చాలా శుభ పరిణామం అని అన్నారు.కార్యక్రమంలో బండి కోటేశ్వర,తుమ్మ శోభన్ బాబు,కనుకుంట్ల అరవింద్,భూపతి ప్రవీణ్,బుర్ర కుమారస్వామి,పుల్ల అద్భుత రావు,పుస్కూరి అరవింద్,రత్నాకర్,మహంకాళి రమేష్, వరికోలు రాజేందర్,చేరిపెల్లి రతన్ కుమార్,మహేందర్, అకినపెల్లి రవీందర్,పబ్బు సుభాష్,శనిగరపు సంపత్,పుల్ల సంజీవ్,గుర్రం సురేష్,ఆనందం,రత్నం,మొగిలి,చిట్టి సుందరయ్య,మేడిపల్లి రాజు,బుర్ర కుమారస్వామి,బుర్ర కరుణాకర్, ఆకాష్, దేషిని రజనీ కాంత్, నాసాన్ రాజు,నడ్డునురి ప్రసాద్, సముద్రాల మొగిలి,రాజు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………….
