* ప్రజల ముంగిటకే స్పెషలిస్ట్ వైద్యం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం చే ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఉప్పల్ గ్రామ సర్పంచ్ రమ-నాగరాజు, ఉప సర్పంచ్ సిద్ధార్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏ. అప్పయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ…. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటివరకు 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ నెల 6వ తేదీ నుండి స్పెషలిస్ట్ క్యాంప్లు నిర్వహిస్తున్నారని , ఇప్పటివరకు జిల్లాలో 1,597 మంది రోగులకు ఎంజీఎం ఆసుపత్రి నుంచి వచ్చిన ఆరుగురు నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించారన్నారు. వీరిలో మెరుగైన వైద్యం అవసరమైన 132 మందిని ఎంజీఎం, జిఎంహెచ్ ఆసుపత్రులకు రిఫర్ చేశామని ఆయన పేర్కొన్నారు.
* ఆరోగ్యమే మహాభాగ్యం
ఉప్పల్ గ్రామ సర్పంచ్ రమ- నాగరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ప్రజలెవరూ వ్యాధుల బారిన పడకుండా, వ్యాధి నిర్ధారణ అయితే ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఉప సర్పంచ్ సిద్ధార్థ మాట్లాడుతూ, ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములై తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో MGM ఆసుపత్రి స్పెషలిస్ట్ వైద్యులు, PHC డాక్టర్లు రేనుక, సంయుక్త, సర్వేశం, హెల్త్ సూపర్వైజర్లు కనకలక్ష్మి, ప్రభాకర్, ఫార్మసిస్ట్ సుచరిత, స్టాఫ్ నర్స్ సరిత, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్తో పాటు ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
