ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్, 10వ తరగతి విద్యార్థులు మీడియా ఎంటర్టైన్మెంట్, మల్టీ మీడియా అప్పారాల్, వృత్తి విద్యా కోర్సుల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించారు. వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన విషయాలను, నైపుణ్యాలను విద్యార్థులకు సంస్థ సిబ్బంది తెలిపారు.ఈ సంస్థలో ఎలక్ట్రిషన్, మొబైల్ ఫోన్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, సోలార్ ఎలక్ట్రికల్ ,ఎంబ్రాయిడరీ ,టాలీ ,జీఎస్టీ అకౌంటెంట్స్ మొదలైన 18 కోర్సులను రెసిడెన్షియల్ విధానంలో మూడు నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి అనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
………………………………….

