ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఎన్నికల నిర్వహణ పై ప్రిసైడింగ్ అధికారులకు ఆదివారం కమలాపూర్ రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం నిర్వహించి, పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులకు రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఎన్నికలు సజావుగా నడిచే విధంగా ఎన్నికల నిబంధనలపై శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గుండె బాబు మాట్లాడుతూ…ప్రిసైడింగ్ అధికారులు ముందు రోజే ఎన్నికల సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ అధికారులతో వారి ఎన్నికల కేంద్రానికి చేరుకోవాలని, వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని అన్నారు.ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారు మండల కార్యాలయానికి వచ్చి దరఖాస్తు ఫారాన్ని రిటర్నింగ్ అధికారుల నుండి తీసుకొని వారి ఓటు హక్కును ఎంపీడీవో కార్యాలయంలో వినియోగించుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు,పోలింగ్ ఏజెంట్లు గానీ వారికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు అవసరమైనచో ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుండి పొందవచ్చునని తెలిపారు.రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా మండల పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ వేళలలో మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
…………………………………………….
