* గెలిచి నెలలు గడుస్తున్న పట్టించుకునే వారు లేరంటూ…
* ఇదే అదనుగా పార్టీ లోకి కాంగ్రెస్ ఆహ్వానం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు సమస్యతో మండలంలోని ఒక మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త మండలంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఉప్పల్ మేజర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన పాలకవర్గ సభ్యులు తమను పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానాలు వస్తున్నాయంటూ ఆలోచనలో పడ్డారు. ఇటీవల అందరూ కలిసి దీనిపై చర్చించుకున్నట్టు సమాచారం, దీనిపై స్పందించిన ఒక బీఆర్ఎస్ పాలకవర్గ సభ్యుడు మాట్లాడుతూ, గెలిచి రెండు నెలలు దాటింది ఆయన పార్టీలో గుర్తింపు లేకుండా పోయింది. మా గెలుపు, కృషి, గుర్తించబడటం లేదని వాపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు సంక్షోభం నుంచి బయటపడకపోతే మరింత మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనే అంచనాలు బలపడుతున్నాయి. ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అర్బన్ ఏరియాల్లో కాంగ్రెస్ భారీగా గెలిచిన నేపథ్యంలో, బీఆర్ఎస్లో గుర్తింపు సమస్య తీవ్రమవుతోంది. పార్టీలో కృషి గుర్తించబడకపోవడం, సైడ్‌లైన్ అవుతున్న భావన, భవిష్యత్ అవకాశాల లేమి వంటి కారణాలతో నేతలు కాంగ్రెస్ వైపు జంప్ చేసే అవకాశం ఉంది.
