* ఖమ్మం జిల్లాలో ఘటన
ఆకేరున్యూస్ ఖమ్మం: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మంగలితండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలి తండాకు చెందిన రైతు ధరావత్ పంతులు (52) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు..ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఇల్లందులో ఉన్న ఆస్పత్రికి తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయాడు. మృతిడికి భార్య ఇద్దరు సంతానం. ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………
