
ఆకేరు న్యూస్,డెస్క్ : బీసీలకు 42 శాతం రిజర్తేషన్లు పెంచాలని ఢిల్లీలో పార్టమెంట్ ఎదుట తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తమిళనాడు ఎంపీ కనిమొళి పూర్తి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఎంపీలు చేస్తున్న న్యాయమైన డిమాండ్ ను కేంద్రం వెంటనే ఆమోదించాలన్నారు. తరతరాలుగా బీసీలు అన్యాయానికి గురవుతున్నారని కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయిన కనిమొళి గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని కనిమొళి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వానికి డీఎంకే అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
………………………………………….