– ఉప్పల్లో 24 గంటల అఖండ శివనామస్మరణ
ఆకేరు న్యూస్, కమలాపూర్: కార్తీక పౌర్ణమి సందర్భంగా మండలంలోని కమలాపూర్, ఉప్పల్, ఉప్పల్ పల్లె ,అంబాల, మర్రిపల్లిగూడెం పలు గ్రామాల్లో కార్తీక పౌర్ణమి పండుగను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాల్లో భక్తులు దీపారాధన చేసి, పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉప్పల్లోని సాంబమూర్తి దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే కార్తీకదీపాలు వెలిగించుకొని, సాంబమూర్తిని దర్శించుకున్నారు. పూజలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు.సాయంత్రం ఆకాశదీప కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ శివనామస్మరణ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు శివ నామస్మరణ చేశారు. కార్యక్రమంలో దేవాలయ పూజారి గోవర్ధనగిరి నరసయ్య శర్మ, అధిక సంఖ్యలో మహిళలు ,అమృత మల్లయ్య, ర్యాకం లచ్చన్న, గట్టయ్య, మహారాజ స్వామి, నాయినేని శ్రీనివాసరావు, ఐలయ్య, , గట్టు రవీందర్ , ఎలిగేటి రాజమౌళి , భక్తులు పాల్గొన్నారు.
……………………………………………………..
