* ఓ ఫంక్షన్లో రేవంత్ రెడ్డి పేరును పలకనందుకే కక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అల్లు అర్జున్ అరెస్ట్ పై బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Kausikreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఫంక్షన్లో రేవంత్ రెడ్డి పేరును బన్నీ చెప్పకపోవడంతోనే ఆయనపై కక్షగట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి(Revanthreddy) కావాలనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించారన్నారు. దేశం, ప్రపంచం మొత్తం ఐకానిక్ స్టార్ గా గుర్తించిన వ్యక్తిని అవమానించారని తెలిపారు. థియేటర్ వద్ద బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. రేవంత్ రెడ్డి జీపు ఎక్కి చేతులు ఊపిన వందల వీడియోలు ఉంటాయని తెలిపారు. ఒక క్రిమినల్ ను అరెస్ట్ చేసినట్లు బెడ్ రూంకు వెళ్లి మరీ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కోర్టు(Court) తీర్పును కూడా రేవంత్ రెడ్డి గౌరవించడం లేదని ఆరోపించారు.
……………………………………………………