* ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం
*గ్రామాల్లో ఎన్నికలుంటే.. జిల్లా కేంద్రాల్లో శంకుస్థాపనలా..?
* ఎక్స్ వేదికగా కవిత ట్వీట్
ఆకేరు న్యూస్, డెస్క్ : సీఎం రేవంత్‌పై జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటే.. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేయడంపై కవిత విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కవిత ట్వీట్ పెట్టారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేస్తున్నారా.. ? అని ప్రశ్నించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు. ప్రజలను ప్రభుత్వ సొమ్ముతో సీఎం సభకు తీసుకువచ్చి వారి సీఎం ఏం సందేశం ఇస్తారని ఎక్స్ వేదికంగా ప్రశ్నించింది. ఇది ముమ్మాటికీ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించటమేనని ఆరోపించారు. సీఎం జిల్లాల పర్యటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలను మాత్రమే సీఎం సభకు తరలించేలా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే సీఎం జిల్లాల పర్యటను ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
………………………………………………..
