
ఎమ్మెల్సీ కవిత
* పార్టీ నుంచి సస్పెండ్ చేయలేరని వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ లో ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. పార్టీపైనా, కేటీఆర్ పైనా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ ఎస్ విలీనాన్ని ఒప్పుకునేది లేదన్నారు. బీజేపీతో బీఆర్ ఎస్ కలిస్తే లిక్కర్ నేరాన్ని అంగీకరించినట్లు అవుతుందని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంచిర్యాలలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు. తాను జైలులో ఉన్నప్పుడే విలీన ప్రతిపాదనను వ్యతిరేకించానని స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి సస్సెండ్ చేస్తారని అనుకోవట్లేదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని అన్నారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు. బీజేపీలో పార్టీ విలీనాన్ని నేను ఒప్పుకోనని తేల్చి చెప్పారు. బీజేపీ(BJP)తో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని పేర్కొన్నారు. కేసీఆర్కు లేఖ రాయడంలో తప్పు లేదని అభిప్రాయ పడ్డారు. పార్టీ కోసమే కేసీఆర్కు లేఖ రాశానని చెప్పారు. కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించానని వివరించారు. లేఖను బయటపెట్టినవారిని పట్టుకోవాలని కవిత డిమాండ్ చేసారు. తనకు సొంత జెండా.. అజెండా లేవని వివరించారు. కేసీఆర్ (KCR) తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనని మరోసారి పరోక్షంగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు.
………………………………………..