
* కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
* కాళేశ్వరంతో తెలంగాణలో 35 శాతం భూ భాగానికి తాగునీరు
* 40 లక్షల ఎకరాలకు సాగునీరు
* హైదరాబాద్ కు శాశ్వతంగా తాగునీటి పరిష్కారం
* 16 టీఎంసీలతో అన్ని పరిశ్రమలకు నీరు
* కాళేశ్వరంపై జ్యుడీషియల్ కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్
* కేసీఆర్ కు పేరు రావద్దని కాంగ్రెస్ కుట్ర
* అవసరమైతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమిస్తాం
* ధర్నా చౌక్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా
* ప్రభుత్వంపై విరుకుపడ్డ కవిత
ఆకేరున్యూస్ , హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులమీద తప్పులు చేస్తోందని , ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ ఎదుట హాజరు కావాలని కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా హైదరాబాద్ లోని ధర్నా చౌక్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలోఆమె పాల్గొని ప్రసంగించారు.. ఈ ధర్నాలో వివిధ జిల్లాలనుంచి తెలంగాణ జాగృతి సభ్యులు పాల్గొన్నారు. కేసీఆర్ చేసిన తప్పేంటంని కవిత నిలదీశారు. తెలంగాణకు నిధులు తీసుకురావడం తప్పా.. తెలంగాణకు నీళ్లు అందివ్వాలనుకోవడం తప్పా అని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కవిత అన్నారు.21 పంప్ హౌస్ లు 15 రిజర్వాయర్లు, 200 కిలో మీటర్ల టన్నల్లు,15 వందలకు పైగా కాలువులతో డిజైన్ చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్ అని అన్నారు.కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టి తో 330 ఫిరమిడ్లు కట్టవచ్చు ,ప్రాజెక్టు కోసం వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు , వాడిన కాంక్రీట్ తో 50 బుర్జు ఖలీఫా లాంటి భవనాలు. ఎత్త పోసిన మట్టితో
300 లకు పైగా ఫిరమిడ్లు కట్ట వచ్చని కవిత అన్నారు.
40 లక్షల ఎకరాలకు సాగునీరు
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ లో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని
హైదరాబాద్‌కు శాశ్వత ంగా తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు. రాజశేశర్ రెడ్డి హయాంలో రూపొందించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కేవలం 16 టీఎంసీల నీరు నిలువ ఉండే విధంగా డిజైన్ చేశారని కాని కేసీఆర్ తెలంగాణలో 140 టీఎంసీల గోదావరి జలాలు నిలువ ఉండే విధంగా రూపకల్పన చేశారని కవిత అన్నారు.
బనకచర్లను అడ్డుకోండి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే చంద్రబాబు కుట్రలను అడ్డుకొని బనకచర్లను ప్రాజెక్టును అడ్డుకోవాలని సవాల్ విసిరారు.
బీజేపీ నేతల మౌనం ఎందుకు?
కేంద్రంలో బీజేపీ సర్కార్ చంద్రబాబుపై ఆధారపడి ఉందని అందుకే బీజేపీ నేతలు తెలంగాణకు
అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆమె అన్నారు. ఈ టెల రాజెందర్‌కు తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రధాని మోదీతో మాట్లాడి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కవిత సూచించారు. బీజేపీ ఎంపీలె కేంద్రానికి ఓ లేఖ రాయాలని ఆమె కోరారు. నిజంగా తెలంగాణ బీజేపీ నేతలకు చిత్త శుద్ధి ఉంటే కళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించడానికి కేంద్రాన్ని ఒప్పించాలని సవాల్ విసిరారు
గల్లీ టూ ఢిల్లీ ఉద్యమిస్తాం
కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని గల్లీ టూ ఢిల్ల దాకా ఉద్యమిస్తామని కవిత హెచ్చరించారు. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ జ్యుడిషయల్ కమిషన్ కాదని అది కాంగ్రెస్ కమిషన్ అని కవిత ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని కవిత హెచ్చరించారు.
…………………………………………………………………