
* నన్ను అడుగకుండానే ఉరి తీశారు
* ఏ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదు
* త్వరలో నిర్ణయం ప్రకటిస్తా
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ఎమ్మెల్సీ పదవికి బీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ ఎస్
నుంచి బహిష్కరణకు గురైన తరువాత కవిత సంచలన
నిర్ణయం తీసుకున్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడానికి ఎప్పటి నుంచో
ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. వివరణ కోరకుండా ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని కవిత ఆరోపించారు. తన బహిష్కరణ వెనుక హరీష్ రావు, సంతోష్ రావుల
ప్రమేయం ఉందన్నారు. పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని విచ్చిన్నం చేసే
కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు.. తనకు ఏ పార్టీలో చేరే
ఉద్దేశ్యం లేదని త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తానని కవిత వెల్లడించారు..
——–