
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ కవిత
మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ ఎస్
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. మీడియా ముందే
రాజీనామా విషయాన్ని వెల్లడించనున్నారని తెలిసింది. ఇప్పటికే జాగృతి పేరుతో
తెలంగాణలో తన స్వంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్న కవిత త్వరలోనే కొత్త పార్టీ
పెట్టబోతున్నారని తెలుస్తోంది. మీడియా ముందు తన రాజీనామాతో పాటు కొత్త పార్టీ
గురించి కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
…………………………………