
* షర్మిల లాగే పాదయాత్రకు సన్నాహాలు
* కేసీఆర్ డైరెక్షన్లోనే కవిత కొత్త పార్టీ
* బిజెపి ఎంపి రఘునంద్ రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేస్తారని, అలాగే జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని మెదక్ ఎంపి రఘునందన్ రావు తెలిపారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ రాబోతుందని, పార్టీ పెట్టి షర్మిల తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనుందని అన్నారు. తుఫ్రాన్లో రఘునందన్ రావు పర్యటించారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలపై జోస్యం చెప్పారు. మాజీ సిఎం కెసిఆరే కవితతో పార్టీ పెట్టిస్తున్నారని అన్నారు. తండ్రి, కుమార్తె మధ్య మధ్యవర్తులెందుకని ప్రశ్నించారు. కవిత గెలిచినప్పుడు కెసిఆర్ దేవుడయ్యారని, ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారని విమర్శించారు. దెయ్యాల మధ్య పదేళ్ల రాజకీయం ఎందుకని రఘునందన్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఈ లేఖపై ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు తమదైన శైలిలో వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అలాంటి వేళ మెదక్ ఎంపీ , బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి స్పందించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తండ్రి, కుమార్తెల మధ్య మధ్యవర్తులెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం తెలంగాణలో కవిత పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారని.. మరి ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారంటూ ఎంపీ రఘునందన్ సందేహం వ్యక్తం చేశారు.
…………………………………………………………………..