*మడికొండలో సెల్ఫ్ ఇమ్మోలేషన్ అటెంప్ట్….
*చెత్త డంపింగ్ యార్డ్ సెగతో కదులుతున్న కాజీపేట!
చావడానికైనా సిద్ధం కానీ ఇక్కడ ఉండలేం.. డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటంలో ఉద్రిక్తత!
15 ఏళ్ల గోస.. డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆందోళనకారుడు!
ఆలేరు న్యూస్, కాజీపేట (మడికొండ):
హన్మకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మడికొండ చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక నివాసాల మధ్య ఉన్న చెత్త డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా స్థానికులు శాంతియుత రీతిలో నిరాహార దీక్ష చేపడుతున్నారు. అయితే, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురైన పండుగ రాజ్‌కుమార్ అనే వ్యక్తి బుధవారం అందరూ చూస్తుండగానే తన ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అసలేం జరిగింది?
మడికొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ కారణంగా చుట్టుపక్కల కాలనీల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాజ్‌కుమార్ ఒక్కసారిగా డీజిల్ డబ్బాతో వచ్చి తనపై పోసుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, తోటి ఆందోళనకారులు అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం పోలీసులు, స్థానికులు కలిసి రాజ్‌కుమార్‌ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
15 ఏళ్ల నరకం.. వెల్లువెత్తుతున్న ఆవేదన:
ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న స్థానికులు తమ గోడును వెళ్లగక్కారు. గత 15 ఏళ్లుగా ఈ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దుర్వాసన: నిత్యం వెలువడే కుళ్ళిన వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు.
ఆరోగ్య సమస్యలు: చెత్త కారణంగా దోమలు, ఈగలు పెరిగిపోయి చిన్న పిల్లలు, వృద్ధులు తరచూ రోగాల బారిన పడుతున్నారు.
కాలుష్యం: భూగర్భ జలాలు కలుషితం కావడంతో తాగే నీరు కూడా విషతుల్యంగా మారుతోందని వారు ఆరోపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని బాధితులు మండిపడుతున్నారు. ప్రాణత్యాగానికి సిద్ధపడితే తప్ప ప్రభుత్వం స్పందించదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని డంపింగ్ యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనను
