* పార్టీ శ్రేణులతో నేడు సమావేశం
* ఎర్రవెల్లి ఫాం హౌస్కు చేరుకుంటున్న నేతలు
ఆకేరు న్యూస్, హైదారాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం మొత్తం బీఆర్ఎస్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. హరీష్ రావు, కేటీఆర్ లతో పాటు ముఖ్య నేతలంతా జూబ్లీహిల్స్ లోనే మకాం పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారిన నేపధ్యంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. 2023లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క సీటుకూడా రాలేదు. హైదరాబాద్ పరిధిలోని ఓటర్లందరూ బీఆర్ఎస్ కు తమ ఓటు వేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిచారు. కాగా హైదరాబాద్ పరిధిలో ఇది రెండో ఉప ఎన్నిక. ఈ రెండు ఉప ఎన్నికలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మృతి చెందగా వచ్చినవే.. హైదరాబాద్ లో పరువు కాపాడుకోవలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది . అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ లు జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పార్టీ అధినేత కేసీఆర్ గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.
ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హరీష్ రావు,కేటీఆర్ తో సహా పార్టీ ముఖ్యనేతలు
నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్చార్జులు అందరూ హాజరు కానున్నట్లు తెలిసింది. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేషం చేయనున్నారు. ఇప్పటికే పార్టీ నేతలందరూ ఫాం హౌజ్ కు చేరుకుంటున్నట్లు తెలిసింది.
