
* తెలంగాణకు శత్రువులు కేసీఆర్ కుటుంబసభ్యులే..
* కిషన్ రెడ్డి తెలంగాణ కోసం చేసింది ఏమీ లేదు
* ఢిల్లీలో సీఎం రేవంత్ కామెంట్స్
ఆకేరు న్యూస్, డెస్క్ : తాను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ లోకి రానివ్వనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి వర్గంలో శాఖల కేటాయింపుపై చర్చించేదుకు సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ వెళ్లిన విషయం తెల్సిందే పార్టీ అధిష్టానంతో మంత్రి వర్గ శాఖల కేటాయింపుపై విస్తృతంగా చర్చించిన సీఎం రేవంత తుది జాబితా రూపొందించినట్లు తెలసింది. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు . మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ మధ్య కేసీఆర్ కూతురు కవితి కాంగ్రెస్‌లో చేరుతోందనే వార్తలు ప్రచారం అయింది. కవిత తనతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకొస్తానని పార్టీ హైకమాండ్ ముందు ప్రతిపాదన పెట్టినట్లు వార్తలు వచ్చాయి తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో కలువడానికి సిద్ధంగా ఉన్నట్లు కవిత కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఢిల్లీలోని మీడియా ప్రతినిధులు ఈ విషయమై సీఎం రేవంత్‌ను ప్రశ్నించగా ఘాటుగా స్పందించారు. తాను ఉండగా కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబసభ్యలకు ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులను రేవంత్ అన్నారు. కేసీఆర్ హయాంలో కొన్ని నెలల వరకూ మంత్రి పదవులు కేటాయించకుండా పెట్టుకున్నారని తాను ముఖ్యమంత్రి కాగానే రెండు మూడు రోజుల్లోనే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసి శాఖలు కేటాయించానని రేవంత్ అన్నారు. ఇటీవల తెలంగాణ లో నిర్వహించిన కులగణన సర్వేలో కేసీఆర్ తో పాటు హరీష్ రావు,కేటీఆర్ ,బీజేపీ నేత కిషన్ రెడ్డి పాల్గొనలేదని వివరించారు. వారి నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి వివరాలు సేకరించేందుకు కలెక్టర్లకు సూచించానని సీఎం రేవంత్ అన్నారు. కాళేశ్వరంపై తనకు ఉన్న అభిప్రాయాలను రెండు మూడు రోజుల్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తానన్నారు.తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గం విస్తరణలో సామాజిక న్యాయం పాటించామన్నారు.
………………………………………………………