
* ఎమ్మెల్యేలు టైంపాస్ చేయడం సరికాదు
* మీడియాతో చిట్‌చాట్ లో రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆపరేషన్ కగార్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, కేకేతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి (REVANTH REDDY) తెలిపారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయన పలు విషయాలు వెల్లడించారు. బీఆర్ ఎస్ సభలో కేసీఆర్ చేసిన విమర్శలపై ఆయన బదులిచ్చారు. బీఆర్ఎస్(BRS)ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారని అన్నారు. కేసీఆర్(KCR) స్పీచ్‌లో క్లారిటీ లేదన్నారు. రాహుల్ గాంధీ(RAHULGANDHI)కి, తనకు గ్యాప్ ఉందనడం అవాస్తవమన్నారు. అవసరాలకు అనుగుణంగా కేసీఆర్, మోదీ మాటలు మారుస్తురన్నారని ఆరోపించారు. దేశానికి ఇందిరా గాంధీ లాంటి ప్రధాని కావాలన్నారు. రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదే అన్నారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైంపాస్ చేయడం సరికాదన్నారు. పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
…………………………………………….