
* మాగంటి భౌతికకాయం చూసి కన్నీటి పర్యంతమైన కేసీఆర్
* కుటుంబసభ్యులకు పరామర్శ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నేత మాగంటి గోపీనాథ్ (GOPINATH) ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. మాగంటి మరణం పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా, ప్రజానేతగా పేరు సంపాదించారని కొనియాడారు. మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని కేసీఆర్ సందర్శించారు. భౌతికకాయం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాగంటిని కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన కుటుంబసభ్యులు, మిత్రులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిసిన కేసీఆర్, మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు(HARISHRAO), కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటించారు.
……………………………………………