
* పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఆకేరున్యూస్ హైదరాబాద్ : గోదావరిలో 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని వాటిని ఏపీ వాడుకోవచ్చని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ఏపీ కి వెళ్లినప్పడు అక్కడ రాయలసీమను రతనాలసీమ చేస్తాను అని అన్నారని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.నిజామాబాద్ జిల్లాలో జరిగిన జనహిత పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనాయకులతో కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.బీఆర్ ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బిసిల రిజర్వేషన్ ఇప్పుడుగుర్తుకు వచ్చిందా అని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాఓఇ నటరాజన్ పాలొ్గన్నారు.
………………………………………