తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగం అందించిన ఆర్టికల్ 3 పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. అన్నిరకాల వివక్షతలకు దూరంగా, దేశ ప్రజలందరూ సమానత్వ భావనతో జీవిస్తూ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, భారత సమాజం ముందుకు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణలో రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ తన నిరంతర కృషిని కొనసాగిస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
……………………………………………………………..
