
* ఈ సన్నాసులకు ప్రభుత్వం నడపడం చేతకాదు
* రాహుల్ ఒకలా.. రేవంత్ మరోలా..
* కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీబీఐ మోదీ జేబు సంస్థ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) విమర్శలు చేస్తుంటే, ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) గొప్ప సంస్థ అంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌ది దండుపాళ్యం బ్యాచ్ అని అన్నారు. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదని కేటీఆర్ (Ktr) విమర్శించారు. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతూ దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకున్నా సంక్షేమ పథకాలు ఆగవని, చిత్తశుద్ధి గల్ల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తది తప్ప సాకులు వెతకదని అన్నారు. సన్నాసులకు ప్రభుత్వం నడపడం చేతకాదని, ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపండం.. పదవులు కాపాడుకోవాలనే సోయి తప్ప ఇంకోటి లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు అయినా, ఢిల్లీ ఎన్నికలు అయినా ఎగరాల్సింది గులాబీ జెండానే అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని, ప్రజలు అదే కోరుకుంటున్నారని తెలిపారు. ఎప్పుడైనా చీకటిని చూస్తనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదను చూస్తేనే ర్రం విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీకి ఓటేసి మోసపోయామని రైతులు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై విమర్శలు చేశారు. మాట ఇచ్చి తప్పిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.
……………………………………………….