
* తెలంగాణభవన్‌కు తరలివచ్చిన గులాబీశ్రేణులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ భవన్లో కేసీఆర్ (Kcr) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రులు భారీ కేక్ కట్ చేశారు. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr), హరీశ్‌రావు(Harsihrao).. ఇతర బీఆర్ ఎస్ నేతలు కేక్ కటింగ్‌లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్నారావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమ చరిత్రపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. పుట్టినరోజు నేపథ్యంలో భారీ సంఖ్యలో బీఆర్ ఎస్ శ్రేణులు తెలంగాణభవన్(Telanganabhavan)కు తరలివచ్చాయి. దీంతో ఆ ప్రాంతమంతా గులాబీమయమైంది.
…………………………………….