
ఆకేరు న్యూస్, డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త, ఓ టీవీ చానల్ ఎండీ అయిన శ్రవణ్ కుమార్ కు సుప్రీంకోర్టు(SuprimCourt)లో స్వల్ప ఊరట లభించిది. ఆయనపై కఠిన చర్యలు వద్దని.. అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసు నమోదు అయినప్పటి నుంచి శ్రవణ్ రావు పరారీలో ఉన్నారు. ఇటీవల శ్రవణ్‌పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దాంతో బలవంతంగా ఆయనను అమెరికా నుంచి డిపోర్ట్ చేసే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ముందస్తు బెయిలు నిరాకరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శ్రవణ్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్‌ను కూడా ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని శ్రవణ్‌కుమార్ న్యాయవాది వాదించారు. ఆయన ఎలాంటి రక్షణా ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. శ్రవణ్ (Sravan) తప్పించుకుని అమెరికా వెళ్లారని కోర్టుకు తెలిపారు. శ్రవణ్‌కుమార్ భారత్ వచ్చి విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యంతర రక్షణ ఇస్తే 48 గంటల్లోనే భారత్ వస్తారని శ్రవణ్ న్యాయవాది తెలిపారు. అనంతరం విచారణను ఏప్రిల్ 28కు జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం వాయిదా వేసింది.
………………………………