* 42 శాతం రిజర్వేషన్లకు పార్టీ సిద్ధం
* మీడియాతో వాకిటి శ్రీహరి కామెట్స్
ఆకేరు న్యూస్, హనుమకొండ : సీఎం రేవంత్ అధ్యక్షతన సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిడి శ్రీహరి తెలిపారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్లో అభివృద్ధిని చూసే నవీన్యాదవ్ను గెలిపించారన్నారు. సమావేశానికి ముందు ధర్మసాగర్లో మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేపపిల్లలను అందించారు. రాష్ట్రంలో 26, 600 చెరువులు ఉన్నాయని..ఈ సంవత్సరం రాష్ట్రంలో 8 మెట్రిక్ టన్నుల చేపపిల్లలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రేవంత్ కట్టుబడి ఉన్నారని.. ఇందులో భాగంగానే తెలంగాణాలో పరిశ్రమలు పెట్టేందుకు పలు దేశాల పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు.
………………………………………………
