
* విదేశాల నుంచి హైదరాబాద్‌కు కీలక నిందితుడు
* సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ఓ మీడియా సంస్థ నిర్వాహకులు శ్రవణ్ రావు నిన్న రాత్రి విదేశాల నుంచి హైదరాబాద్(Hyderabad)కు చేరుకున్నారు. సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత ఏడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. కేసు నమోదైన వెంటనే లండన్‌కు , అటు నుంచి అమెరికాకు శ్రవణ్‌రావు (Sravanrao) వెళ్లిపోయారు. కేసు విచారణకు హారుకాకుండా గైర్హాజరవుతూ ఉన్నారు. ఈమేరకు ఆయనతోపాటు ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నెల24న సుప్రీంకోర్టు లో బెయిలుపై విచారణ జరిగింది. ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఆయన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఈ నెల 29న విచారణకు హాజరుకావాలని శ్రవణ్‌రావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనేపథ్యంలో ఆయన విచారణకు హాజరుకానున్నారు. ఈకేసులో ఆయన 6వ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే సిట్ బృందం శ్రవణ్‌రావు ఇంట్లో పలుమార్లు తనిఖీలు చేపట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ (Brs)కు లబ్ధిచేకూర్చేందుకు శ్రవణ్‌రావు సూచనల మేరకే కొందరిపై నిఘా పెట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
……………………………………………………