
* హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు, ప్రభుత్వ అధికారులతో ఎంపవర్డ్ కమిటీ భేటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సీరియస్ గానే విచారణ జరుగుతోంది. ఆ భూముల విషయంలో జరుగుతున్న వివాదాలను నిగ్గు తేల్చేందుకు నిపుణుల కమిటీ ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HYDERABAD CENTRAL UNIVERSITY) 400 ఎకరాల భూవివాదంలో విచారణ జరపడానికి ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. విద్యార్థి సంఘాలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయ్యింది. హెచ్ సీయూ ఎస్యు, విద్యార్థి సంఘాలతో విడివిడిగా కేంద్ర కమిటీ సమావేశమైంది. తాజ్‌కృష్ణలో సెంట్రల్ ఎంపర్డ్ కమిటీ భేటీ అయ్యింది. కంచ గచ్చిబౌలి భూములపై కమిటీ అధ్యయనం చేస్తుండగా.. సీఎస్ శాంతి కుమారి(CS SHANTHI KUMARI), పోలీస్ అధికారులను కలిశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అన్ని రకాల చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం, చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. ఈక్రమంలో విచారణ కొనసాగుతోంది.
…………………………………………………..