
* బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
ఆకేరున్యూస్, హైదరాబాద్: గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న 400 ఎకరాల భూమిని వేలంపాట వేస్తే ఖబడ్డార్ అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థుల సంఘాలతో శుక్రవారం కాచిగూడలోని అభినందన హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని, వేలంపాటలో పాల్గొని భూములు కొనుగోలు చేయరాదని, కొన్నవారు తిరిగి వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ప్రభుత్వ వేలం భూముల వేలం పాటలలో ఎవరు పాల్గొనరాదని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వేలంలో పాల్గొని భూములను కొనుగోలు చేస్తే, వారి దగ్గర నుండి విద్యార్థి సంఘాలతో కలిసి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం వాగ్దానం చేసిన 2,324.05 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బదిలీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో 295 గురుకుల హాస్టల్స్ ఉన్నాయని, వాటిలో ఒక్కటి కూడ సొంత భవనం లేదని, వెంటనే సొంత భవనాలను నిర్మించి ప్రభుత్వ నిజాయితీని చాటుకోవాలని డిమాండ్ చేశారు. భూముల విషయంపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి త్వరలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. భావితరాల కోసం ప్రభుత్వం కోరారు. ఈ కార్యక్రమంలో కోలా జనార్ధన్, మురళీకృష్ణ యాదవ్, శివ కుమార్ యాదవ్, డి.అభినీష్, నందగోపాల్, ఉదయ్ నేత, రాజు నేత, మణికంఠ, రవి యాదవ్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
……………………………………….