* మహా గణపతిని దర్శించుకున్నసీఎం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఖైరతాబాద్ మహా గణపతిని శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 71ఏళ్ల కిందట గణేశ్ ఉత్సవ సమితి ఒకే ఒక అడుగు గణేశుడిని ప్రతిష్ఠించుకుని ఉత్సవాలను ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం 69 అడుగుల గణపతి ప్రతిష్ఠించడం ఆశామాషీ వ్యవహారం కాదన్నారు. గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలని దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. . దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తి చేసుకున్నామని అన్నారు. ఉత్సవాలను విజయవంగా ముగించిన గణేశ్ ఉత్సవ సమితి సభ్యలను అభినందిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.

………………………………………………
