* అడ్డుకోబోయిన బంధువులపై గొడ్డలితో దాడి
* పల్నాడు జిల్లాలో కలకలం
* మాచర్ల, వినుకొండలో పోలీసుల హై అలర్ట్
* రంగంలోకి పోలీసులు
* యువకుడు సురక్షితం
ఆకేరు న్యూస్, పల్నాడు : రాజకీయంగా ఉన్న పాతకక్షల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఓ వ్యక్తి కిడ్నాప్ ( kidnap ) కు గురయ్యాడు. కూరగాయలు తీసుకుని ఆటోలో వెళ్తున్న అతడిని బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు ఆటో ఢీకొట్టి.. అతడిని లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన బంధువులపై గొడ్డలితో దాడి చేశారు. ఈ కిడ్నాప్ పల్నాడు జిల్లాలో కలకలం రేపుతోంది. దుగ్గి మండలానికి చెందిన ఒంటేరు నాగరాజు.. మంగయ్య అనే నాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. ఎన్నికల తర్వాత మంగయ్య బృందం ఊరు విడిచి వెళ్లిపోయింది. నాగరాజు వినుకొండ ప్రాంతం వెలటూరులో ఉంటున్నట్లు తెలిసింది. వినుకొండ నుంచి కూరగాయలు తీసుకుని నలుగురితో కలిసి వెళ్తున్న ఆటోను బొలెరో వాహనంతో నిందితులు ఢీ కొట్టారు. వెంకుపాలెం వద్ద నడిరోడ్డుపైనే ఆటోలో ఉన్న నాగరాజును బయటకు లాక్కెళ్లి వాహనంలోకి ఈడ్చుకెళ్లారు. అడ్డుకోబోయిన బంధువులపై గొడ్డలితో దాడి చేశారు. వారి వద్దమారణాయుధాలు ఉండడంతో నాగరాజును హత్యచేసి ఉంటారని ముందుగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. . ఈఘటనతో వినుకొండ, మాచర్లలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నాగరాజు ఆచూకీ కోసం ఆరు బృందాలు గాలిస్తున్నాయి. కల్వర్టు, చెరువు, అటవీ ప్రాంతాల్లో గాలించాయి.
* పోలీసుల రంగ ప్రేవేశం
నాగరాజు క్షేమం
ఆటోలో వెళ్తున్న యువకుడిని అడ్డగంచి మరీ కిడ్నాప్ చేయడం, అడ్డు వచ్చిన బంధువులపై ఏకంగా గొడ్డలి తో దాడి చేయడం లాంటి సంఘటన జరగడంతో పలనాడు ప్రాంతంలో కలకలం సృష్టించింది. గతం కొంత కాలంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో పోలీస్‌లు ఈ సంఘటనను సవాల్ గా స్వీకరించారు. వెంటనే ఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. ప్రత్యేక దళాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్‌కు గురయిన యువకుడు నాగరాజును కాపాడారు. నేరానికి పాల్పడిని నిందితులను బోలేరో వాహనాన్ని పోలీసులులు అదుపులోకి తీసుకున్నారు.
——————————————————————–