
* స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
ఆకేరు న్యూస్, డెస్క్ : ముంబయి విమానాశ్రయంలో రూ.6.3 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ (Bangkok) నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూస్‌లో ఈ బంగారాన్ని తరలిస్తున్న డీఆర్ ఐ అధికారులు గుర్తించారు. బంగారం (Gold) కొనుగోలుదారుడిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి ముంబయి (Mumbai)వచ్చిన విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేస్తుండగా, ఓ ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో క్షుణ్నంగా పరిశీలించారు. తనిఖీల్లో అతడి షూల్లో బంగారు కడ్డీలు ఉన్నట్లు గుర్తించారు. వాటికి ఎలాంటి పత్రాలూ లేవు. ఆ బంగారం విలువ 6.3 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితుడితో పాటు ఇంకొకరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
……………………………………