* రేవంత్ ది ఫ్రాడ్, ఫేక్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వం
* పాలన చేత కాక వ్యక్తిగత విమర్శలు
* బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని తప్పుడు ప్రచారం
* ఆయనకు ఆర్ఆర్ఆర్పై అవగాహన లేదు
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ సర్టిఫికెట్ తనకు అవసరం లేదని తెలిపారు. రేవంత్ విమర్శలపై కిషన్ రెడ్డి బదులిచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ కుటుంబ పార్టీ కాదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం బీజేపీకి తెలుసన్నారు. తమ పాలనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు. ఫేక్ వీడియోలతో తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy ) ఒక్కమాట మాట్లాడరని అన్నారు. హామీలు ఏం అమలు చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. హామీల అమలులో రేవంత్ విఫలం అయ్యారన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు తనపైనా, బీజేపీపైనా రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ ఎస్ కలిసిపోయాయని ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలోనూ ఎన్నికల ప్రచారంలో రేవంత్ తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు. రూ.లక్ష కోట్ల అవినీతిని బయటపెడతామని రాహుల్, రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పటి వరకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. లక్ష కోట్లు కాదు కదా రూ.లక్ష అవినీతి కూడా బయటపెట్టలేదన్నారు. సీఎం రేవంత్ నోటికి ఏం వస్తే అది మాట్లాడుతున్నారని తెలిపారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ దగా చేస్తోందన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి రూ.వేల కోట్లు వసూలు చేస్తోంది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇక్కడ వసూలు చేసి, బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపడం వాస్తవం కాదా అని తెలిపారు. ఆర్ ఆర్ ఆర్కు తాను అడ్డుపడుతున్నానని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆర్ఆర్ఆర్కు ఆమోదం తెలిపినప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు ఆర్ఆర్ఆర్పై అవగాహన లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిది ఫ్రాడ్(Fraud), ఫేక్(Fake), ఫాల్స్(False), ఫెయిల్యూర్ (Failure) ప్రభుత్వం అన్నారు. మిగులు బడ్జెట్ తెలంగాణను కేసీఆర్, రేవంత్ అప్పులపాలు చేస్తున్నారని అన్నారు. బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్(KCR), రేవంత్ ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
