
* సీఎం రేవంత్ సంచలన ప్రకటన
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : 15 రోజుల్లో ప్రొఫెసర్ కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రొఫెసర్ కోదండరాంను బీఆర్ ఎస్ ఇబ్బందులకు గురిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఎమ్మెల్సీని చేసిందని రేవంత్ అన్నారు.కానీ బీఆర్ఎస్ నేతలు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన పదవిని తీయించేశారని విమర్శించారు. ప్రొ. కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని ఊడకొట్టేందుకు రూ. కోట్లు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. కోదండరాం పదవి పోయిందని బీఆర్ ఎస్ నేతలు శునకానందం అనుభవిస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 15 రోజుల్లో కోదండరామ్ ను ఎమ్మెల్సీ చేసి చూపిస్తానని సీఎం ప్రకటించారు.
……………………………………….