* బడ్జెట్‌పై ప్రసంగంలో మాటల యుద్ధం
* కోమటిరెడ్డిది ఆఫ్ నాలెడ్జ్.. ఆయనకు సమాధానం చెప్పడం వృథా : హరీశ్‌రావు
* హరీశ్‌రావుకు అస్సలు నాలెడ్జే లేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాలుగో ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana assembly meetings) వాడివేడీగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) గురువారం అసెంబ్లీ (Assembly) లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ సభలో జరిగే చర్చలో పాల్గొనేందుకు బడ్జెట్ (Budget) ను అధ్యయనం చేసి శుక్రవారం సెలవు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో ఉదయం 10 గంటల నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ సందర్భంగా సభలో హరీష్ రావు (Harish Rao), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బడ్జెట్లో దళితులను, మహిళలను మోసం చేశారని విమర్శించారు. ఒంటరి మహిళలు కంటనీరు పెట్టుకుంటున్నారని అన్నారు. బతుకమ్మ చీరల విషయంలో సీఎం మహిళలను కించపరిచేలా మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ ఎస్(BRS) దళితులను సీఎం చేస్తామని మోసం చేసిందని, హరీష్‌రావు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని అన్నారు. గతంలో హరీష్‌రావు ఓ డమ్మీ మంత్రి అని విమర్శించారు. దీనిపై హరీష్‌రావు బదులిస్తూ కోమటిరెడ్డికి ఆఫ్ నాలెడ్జ్ అని, ఆయనకు సమాధానం చెబితే సమయం వృథా అని ఎద్దేవా చేశారు. అస్సలు హరీశ్‌రావుకు నాలెడ్జే లేదని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నడిరోడ్ల మీద విద్యార్థులపై లాఠీ చేయడం ప్రజాస్వామ్యమా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వంలో లా అండర్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిందని, 8 నెలల కాలంలో 500 హత్యలు జరిగాయని వెల్లడించారు. తెలంగాణలోదశ, దిశలేని పాలన నడుస్తోందని చెప్పారు.
———————