
* ఘనంగా కొమురం భీం వర్ధంతి
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివాసీల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం అడవి బిడ్డల హక్కులకై పోరు చేసిన ఉద్యమ కెరటం , గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీం వర్థంతి పురస్కరించుకొని భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసి సంఘాల నాయకులు కొమరం భీం ఆశయాలను కొనసాగించాలని పేద ఆదివాసీల విద్యా ఉద్యోగ సంక్షేమ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి , తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర , ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి , మండల అధ్యక్షుడు మోకాళ్ళ వెంకటేష్ , పాయం కోటేశ్వరరావు , సురేందర్ , చంద మహేష్ , వంక నరేష్ , ఇర్ప స్వామి , ఉదయ్ , బంగారి అజయ్ , గౌరబోయిన మోహన్ రావు , ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు ఆదివాసీ ప్రజలు తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.
……………………………………………..