* రాష్ట్రంలో నడుస్తున్నది మాఫియా రాజ్యం
* ఇంత జరుగుతున్నబీజేపీ నాయకులు స్పందించడం లేదు
* నవంబర్ 14న జూబ్లీహిల్స్ గురించి మాట్లాడుకుందాం
* కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఓ మాఫియా లీడర్ లా ప్రవర్తిస్తున్నాడని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గురువారం ఆయన తెలంగాణ భవన్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. సీఎం కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకంగా మంత్రుల ఇళ్ల వద్దకే పోలీసులు అరెస్టు చేయడానికి పోయే పరిస్థితి దాపురించిందన్నారు.
పంపకాల గొడవలు
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు మధ్య పంపకాల గొడవలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ మంత్రీ ఖాతరు చేయడం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు, మంత్రి కొండా కుటుంబం మధ్య గొడవ జరిగిందన్నారు. అందుకే కొండా సురేఖ ఇంటికి రేవంత్ పోలీసులను పంపించారని పేర్కొన్నారు.రూ.500 కోట్ల టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య పంచాయితీ వచ్చిందని ఆరోపించారు. శంకరాహిల్స్ లో రేవంత్ ఏం చేస్తున్నారో, సర్వే నంబర్ 83లో ఏం చేయాబోతున్నారో అన్నీ తమకు తెలుసని అన్నారు. ముమ్మాటకీ రాష్ట్రాన్ని దండు పాళ్యం ముఠానే నడుపుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దండు పాళ్యం ముఠాకి నాయకుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.
ఇంత జరుగుతున్నా బీజీపీ నేతల మౌనం
రాష్ట్రంలో ఇంత అవినీతి అరాచకం జరుగుతున్నా బీజేపీ నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడురాం చందర్ రావులు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెసై్ కు బీజేపీలకు మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందన్నారు. ఇద్దరూ తోడు దొంగలే అంటూ కేటీఆర్ విమర్శించారు. డీజీపీ శివధర్ రెడ్డి ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా ప్రవర్తించాలని కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప్ప ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలవబోతోందని నవంబర్ 14న జూబ్లీహిల్స్పై మాట్లాడుకుందామని కేటీఆర్ అన్నారు.
