ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తుండటంతో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఏ పనిచేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి చేశాను. అరపైసా అవినీతి చేయలేదన్నారు. నామీద కేసుపెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నవ్ రేవంత్ రెడ్డి. అది నీవల్ల కాదన్నారు.
……………………………….