KTR
* కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
* ప్రభుత్వ వ్యవస్థలు గూండాగిరికి అండగా నిలుస్తున్నాయి : కేటీఆర్
* తెలంగాణలో అరాచకత్వం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లో తన సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పోలీస్ స్టేషన్లోకి వచ్చి తన సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు గూండాగిరికి అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగించడమే కాకుండా, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇలాంటి అరాచక పరిస్థితులు మరింత పెరిగే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సమయంలో గూండాగిరికి మద్దతుగా నిలవడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ” అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్ లోకి ఏకంగా 15 మంది గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య.
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది.
ఇది కాంగ్రెస్ గుండాల పనా…
— KTR (@KTRBRS) September 14, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.
