సోమాజిగూడలో రంజాన్ తోఫా…
పేద ముస్లిం కుటుంబాలకు రేషన్ కిట్ల పంపిణీ చేసిన కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం సోదరీమణులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. సోమాజిగూడలో మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముస్లిం మహిళలకు కేటీఆర్ స్వయంగా పంపిణీ చేసి ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పండుగ వేళ ప్రతి ఇంట్లో సంతోషం ఉండాలన్నదే తమ పార్టీ ఆశయమని పేర్కొన్నారు. అనంతరం, వందలాది మంది ముస్లిం మహిళలకు ఆయన స్వయంగా రేషన్ కిట్లను అందజేశారు. ఈ కిట్లలో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కేటీఆర్ చేతుల మీదుగా తోఫా అందుకున్న మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పాల్గొన్న ప్రముఖులు..
ఈ సేవా కార్యక్రమంలో కేటీఆర్ వెంట పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ, కర్నె ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ కార్యక్రమ నిర్వాహకులు సలీం మాజీ ఎమ్మెల్సీ మరియు ఇతర స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక… గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని కాపాడుతూ, అన్ని వర్గాల పండుగలకు బీఆర్ఎస్ ప్రాధాన్యతనిస్తుందని నేతలు వెల్లడించారు.
పేదలకు అండగా: ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కుటుంబాలకు ఈ రేషన్ కిట్లు ఎంతో ఊరటనిస్తాయని మాజీ ఎమ్మెల్సీ సలీం తెలిపారు.
కార్యకర్తల ఉత్సాహం: కేటీఆర్ రాకతో సోమాజిగూడ ప్రాంతంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
