* రేవంత్ రెడ్డి ఆలోచన అదే
* ఢిల్లీకి డబ్బుల మూటలు
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాత బాస్ కు కోపం రావొద్దు.. కేసీఆర్ కు పేరు రావొద్దనేదే సీఎం రేవంత్ ఆలోచన అని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శించారు. బీఆర్ ఎస్ హయాంలో కట్టిన పరిశ్రమలకు రిబ్బన్లు కట్ చేయడం తప్పా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేసినవి ఏవీ లేవన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడారు. డబ్బుల మూటలు ఢిల్లీకి పంపితే, రాష్ట్రంలో పనులకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ (KCR) అధికారంలోకి వస్తేనే అభివృద్ది జరుగుతుందన్నారు. తొందరగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందనే అక్కసుతోనే రేవంత్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మరోపక్క పాత బాస్‌కు కోపం వస్తుందని, ఆ చెంప.. ఈ చెంప వాగిస్తారని భయపడుతున్నారని అన్నారు. పాలమూరు రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగడుతోందన్నారు. హామీలు, పథకాల అమలు గురించి ప్రశ్నించే దూషిస్తున్నారని అన్నారు. ఈ రెండేళ్లలో ఒక్క మంచి పని అయినా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ చేశాడా లేదా ఆలోచన చేయాలని కేటీఆర్ సూచించారు. రైతులకు రైతు భరోసా (RAITHU BHAROSA) ఇవ్వరని, రైతు కూలీలకు వెయ్యి రూపాయలు ఇవ్వరని అన్నారు. ఆఖరకు రైతులకు యూరియా బస్తాలు కూడా ఇవ్వడని తెలిపారు. యూరియా బస్తాలు ఇవ్వలేనోడు.. పాలమూరు సస్యశ్యామలం చేస్తాడంట ఆలోచించాలని రైతులకు సూచించారు.
…………………………………….

