* ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ నుంచి పిలుపు
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్థ కేటీఆర్‌ను ఆహ్వానించింది. ’భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే థీమ్‌తో ఈ సంవత్సరం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు- ఆక్స్ ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకులు సిద్ధార్థ్ సేఠీ తెలిపారు. ఈ సదస్సులో కేటీఆర్ పాల్గొంటే రాబోయే రోజుల్లో ప్రపంచంపై ఇండియా చూపే సానుకూల ప్రభావాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి బలంగా చాటొచ్చని సిద్ధార్థ్ సేఠి తెలిపారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి, సదస్సుకు రావాలని సిద్ధార్థ్ కోరారు.
………………………………..
