* భోజన విరామం తర్వాత పిటిషన్ విచారణ
ఆకేరున్యూస్, హైదరాబాద్: తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు. ఈ మేరకు కేటీఆర్ తరఫు లాయర్లు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత పిటిషన్ను విచారించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారించనుంది. కాగా, లంచ్ మోషన్ను సింగిల్బెంచ్ తిరస్కరించడంతో.. సీజే బెంచ్ ముందు పిటిషన్ను దాఖలు చేశారు.
……………………………………….