
* హెచ్‌సీయూ భూముల వెనుక రూ.10 వేల కోట్ల స్కామ్ ఉన్నట్లు వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..(CM REVANTHREDDY) బీజేపీ-కాంగ్రెస్ ఉమ్మడి ముఖ్యమంత్రి అని, హెచ్ సీయూ భూముల వెనుక భారీ స్కాం వివరాలను రెండు రోజుల్లో బయటపెడతానని చెప్పారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). అన్నట్లుగానే ఈరోజు సంచలన విషయాలు వెల్లడించారు. హెచ్ సీయూ(HCU) భూములతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల స్కామ్‌కు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు ఓ బీజేపీ ఎంపీ (BJP MP)వెనుక నుంచి సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన హెచ్ఎండీఏ( HMDA) భూముల ద్వారా ప్రభుత్వం దోపిడీకి యత్నిస్తోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ‘మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం’ అనే 3డీ మంత్రాన్ని అమలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం విస్తుపోయిందని తెలిపారు. హెచ్‌సీయూ(HCU)లోని 400 ఎకరాలు అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఆధారంగానే తాను ఈ విషయాన్ని చెబుతున్నట్లు పేర్కొన్నారు. ” రేవంత్ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల స్కామ్‌కు ప్రయత్నిస్తోంది. సీఎంకు బీజేపీకి చెందిన ఓ ఎంపీ వెనుక నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఓ బ్రోకరేజ్ కంపెనీతో చర్చలు జరిపారు. ఎఫ్ ఆర్బీఎం (FRBM)ను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని.. ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని చెప్పింది. ఇందుకోసం ఏకంగా ఆర్బీఐ నిబంధనలు, చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
……………………………………………