
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కవితపై స్పందించడానికి ఏమీ లేదని ఆమె సోదరుడు, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. అది ముగిసిపోయిన అంశమని కొట్టిపారేశారు. కవిత (KAVITHA)వ్యాఖ్యలపై పార్టీలో చర్చించే అధినేత కేసీఆర్ (KCR) నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయిపోయిన దానికి మళ్లీ ఏం మాట్లాడాలి అని మీడియాను తిరిగి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కవిత అంశాన్ని తేలిగ్గా తీసిపారేశారు. రేవంత్ రెడ్డిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ నీరు తరలించబోతున్నాం అంటూ ప్రకటనలు ఇచ్చారని, గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారని, రేవంత్ రెడ్డి(REVANTHRDDY) ది సిగ్గుమాలిన ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగిందని, పునర్నిర్మాణానికి అయ్యే రూ.250 కోట్లును ఖర్చుపెట్టడానికి ఏజెన్సీ ముందుకు వస్తే రెండేళ్ల నుంచి ఎండబెట్టారని అన్నారు. మూసీ పేరుతొ డబ్బులు దండుకోవడమే కాదు.. నేరపూరిత బుద్ధి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా వృథా కాలేదన్నారు.
……………………………………….