
* రజతోత్సవ సభాస్థలి పరిశీలన
ఆకేరున్యూస్, హన్మకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వరంగల్‌కు రానున్నారు. ఎల్కతుర్తిలోని సభాస్థలి పరిశీలించి తగిన సూచనలు ఇవ్వనున్నారు. అక్కడ ఉన్న పార్టీ ఇన్చార్జీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నప్పటికీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలను కేటీఆర్ ఇవ్వనున్నారు. నేడు హైదరాబాద్ నుంచి హసన్‌పర్తి మీదుగా ఎల్కతుర్తికి చేరుకొని అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించి నాయకులతో మాట్లాడుతారు. అలాగే అందుబాటులో ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడి తిరుగు ప్రయాణమవుతారు.
…………………………………….