
* బీఆర్ ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తా అన్నాడు
* బీజేపీ ఎంపీ సీఎం రమేష్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఇంటి చుట్టూ తిరిగాడని..తనపై తన చెల్లి కవితపై విచారణలు జరుగకుండా చూడాలని ప్రాధేయపడ్డాడని సీఎం రమేష్ వెళ్లడించారు. తన చెల్లి కవితను లిక్కర్ స్కాం నుంచి తప్పిస్తే బీఆర్ ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామనే ప్రతిపాదన చేశారని తెలిపారు. కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు వెనుక సీఎం రమేష్ హస్తం ఉందని కేటీఆర్ ఆరోపించారు. భూముల తాకట్టులో సహాయం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో సీఎం రమేష్ కు రూ 16 వందల కోట్ల రోడ్డు కంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించిన నేపధ్యంలో కేటీఆర్ ఆరోపణలకు సీఎం రమేష్ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. తనపై కాని తన కుటుంబ సభ్యులపై కాని చెల్లి కవితపై కేంద్రప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించికుండా చూడాలని తనను బతిమిలాడారని సీఎం రమేష్ తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలు బద్ద శత్రువులని అలాంటిది ఇద్దరి మధ్య అవగాహన ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనం అని సీఎం రమేష్ అన్నారు. కేటీఆర్ మంత్రివి ఎలా అయ్యావు,, ఏ స్కూల్ లో చదువుకున్నావు బుద్ద ఉండే మాట్లాడుతున్నావా అంటూ ఎద్దేవా చేశారు.ఫ్యూచర్ సిటీలో పలు కంపెనీలు టెండర్లు వేశాయని నిబంధనల ప్రకారం రుత్విక్ కంపెనీకి టెండర్ దక్కించుకుందని రమేష్ తెలిపారు.
……………………………………………